Sunday 29 June 2008

అలమేలు మంగ నీ అభినవ రూపము

అలమేలు మంగ నీ అభినవ రూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా

గరుధాచలాధీశు ఘనవక్షమున నుండి
పరమానంద సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాధుని
హరుషించగ జేసితివి కదమ్మా

శశి కిరణములకు చలువల చూపులు
విశదముగా మీద వెదచల్లుచు
రసికత పెంపున గరగించి యెప్పుడు నీ
వశము చెసుకొంటి వల్లభునోయమ్మా


రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టి మాకు తిగిరించు వలపు మాటల విభు
జట్టిగొని పురమున సతమైతివమ్మా

రామదాసు కీర్తన

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ

ప్రక్కన చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగా మరుకేళి జోక్కియుండు వేళ

లోకాన్తరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతలు ననేక శయ్యనున్న వేళ

అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరో బాధించు

తాళ్ళపాక అన్నమయ్య పాటలు

కంటి శుక్రవారము గడియ లేడింట ! అంటి అలమేల్మంగా అండ నుండే స్వామిని : : పల్లవి ::

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి ! కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మ తోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి ! తుమ్మేదమై చాయ తోన నెమ్మది నుండే స్వామిని :: కంటి ::

పచ్చ కప్పురమే నూరి పసిడి గిన్నెల నించి ! తెచ్చి శిరసాదిగా దిగనలగి
అచ్చెరపడి చూడ అందరి కన్నుల కింపై ! నిచ్చేమల్లె పూవు వలె నిటు తానుండే స్వామిని :: కంటి ::

తట్టుపునుగే కూరిచి ! చట్టాలు చేరిచి నిప్పు ! పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది ! బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని.


[ తిరుమల వెంకటేశ్వరునికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం, అన్నమయ్య నాటికే ఉన్నట్లు ఈ పాట ద్వారా తెలుస్తున్నది. అభిషేక సమయం లో , తాళ్ళపాక వారు దగ్గరుండి, అభిషేకపు పాటలు పాడటం, అభిషేకానంతరం వారికి ఒక అభిషేకపు పన్నీటి చెంబును తాంబూలచందనఆదులను ఇచ్చి సత్కరించడం జరిగేదని, తిరుమజ్జనోత్సవం శాశ్వతంగా జరపడానికి తాళ్ళ పాక వారే స్వామికి అగ్రహారాలను అర్పించారని కీ.శే. ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్య చరిత్ర పీఠిక లో తెలిపినారు]

కడబెట్టి = కడగ బెట్టి
గోణము = గోచి (బ్రౌన్యము)
కదంబ పొడి = A fragrant powder compounded of various essences
వేష్టువలు = వలువలు
పునుగు = సుగంధ ద్రవ్యం (musk) - పిల్లి నుండీ తీసేది [the gland or bag of musk found in the Civet Cat] (బ్రౌణ్యం)
బిత్తరి స్వామి = నిగ నిగ ప్రకాశించే స్వామి
తట్టు పునుగు = తట్టి ఎత్తిన మేలైన పునుగు



అది శుక్రవారము. ఏడు గంటల కాలము. సంకీర్తనాచార్యుడు స్వామి సన్నిధి ని చేరినాడు. కళలను చిందే అలమేలుమంగా వల్లభుని వేంకటేశ్వరుని దర్శించి నాడు.

స్వామి తిరువాభరణాలు పక్కకు తీసి పెట్టినారు. తిరు మూర్తికి అందంగా గోచీ బిగించి నారు. సుగంధ సురభాలను చల్లే పన్నీట తడసిన వలువలను రొమ్ము, తల, మొల - చుట్టి నారు. వెంకట రమణుడు తుమ్మెద రెక్కల వంటి వన్నె తో ప్రకాశించినాడు.

నూరి పెట్టిన పచ్చ కప్పూరం బంగారు గిన్నెల కెట్టి తల మొదలు పాదాల వరకూ పొందిక గా పూసినారు. నిత్య మల్లె పూవు వలె నిలిచిన స్వామి సౌందర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది - అందరి కన్నుల లో వెన్నెలలు నింపినది.

తట్టుపునుగు చట్టాలలో పేర్చి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళాలలో నింపినారు. వేంకటపతి తిరుమేన దట్టంగా పట్టించి సొంపుగా దిద్దినారు.

భక్తుల వేడుకకు భగవంతుడు మురిసినాడు. ఆ అలమేలుమంగావల్లభుడు నిగ నిగ మెరసి నాడు.


(అన్నమయ్య కీర్తన కు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి తాత్పర్యం)
- అన్నమాచార్య ప్రాజెక్ట్ - టి టి డి వారి రెలిజియస్ సిరీస్ - 559 నుంచి

అన్నమాచార్యుని మధుర సంకీర్తన

తిరుమల గిరి రాయ దేవరాహుత్తరాయ
సురత బిన్నాణరాయ సుగుణకొనేటి రాయ


సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరుస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటి రాయ

గొల్లెతల ఉద్ధండరాయ గొపాలక్రిష్నరాయ
చల్లువెద జాణరాయ చల్ల పరిమళరాయ
చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటి రాయ

సామసంగీతరాయ సర్వ మోహనరాయ
ధామ వైకుంఠ రాయ దైత్య విభాళరాయ
కామించి నిన్ను గోరితి కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయశ్రీ వేంకటరాయ

వేడుకొందామా





పల్లవి : వేడుకొందామా వెంకట గిరి వేంకటేశ్వరుని

చ ౧ ) : ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే వాడు
తోమని పళ్యాల వాడు దురిత దూరుడే


చ ౨ ) : వడ్డీ కాసుల వాడే వనజ నాభుడే పుట్టు
గొడ్డు రాండ్రకుబిడ్డలిచ్చే గోవిందుడే


చ ౩ ) : ఎలమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు
అలమేల్మంగా శ్రీ వెంకటాద్రి నాదుడే

Thursday 5 June 2008

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామ స్త్రోత్రం



సముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్నకః
లంబోదరశ్చ వికతో విఘ్నరాజో గణాధిపః 1
ధూమ్రకేతుర్ గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్ర తుండ శ్శూర్ప కర్ణః హేరంబో స్కందపూర్వజః 2
షోడశైతాని నామాని యః పటేత్ శృణు యా దపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా 3
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్న స్తస్య న జాయతే

ఇతి శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్త్రోత్రం


శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం




ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధారం దేవం విఘ్నవ్యూహ వినాశనం

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ నమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ


చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సిందూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పటేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం

సర్వ విఘ్నవినాశన స్త్రోత్రం

(స్తౌమి గణేశం పరాత్పరం)


శ్రీ రాధికోవాచ -


పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమీశ్వరం

విఘ్ననిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం 1

సురాసురేంద్రైః సిద్ధెంద్రైః స్తుతం స్తౌమి పరాత్పరం

సురపద్మదినేశం చ గణెశం మంగళాయనం 2

ఇదం స్త్రొత్రం మహాపుణ్యం విఘ్నశొకహరం పరం

యః పఠెత్ ప్రాతురుత్ధాయ సర్వ విహ్నాత్ ప్రముచ్యతే 3


ఇతి శ్రీ బ్రహ్మవైవర్త పురాణె శ్రీ కృష్ణ జన్మ ఖండే సర్వ విఘ్న వినాశన స్త్రొత్రం

Wednesday 4 June 2008

నమామి సిద్ధి వినాయకం



ఏక దంతం శూర్పకర్ణం గజ వక్త్రం చతుర్భుజం


పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం


ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం


చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం


దంతాక్షమాలా పరసుం పూర్నమోదక ధారిణం


మొదకాసక్త శుండాగ్రం ఏకదంతం వినాయకం

Tuesday 3 June 2008

గణేశ పంచరత్నస్త్రోత్తం





ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాస లోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం

నతాషుభాసు నాయకం నమామి తం వినాయకం ౧


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ౨




సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేతరోదరం వరం వరే భవక్త్ర మక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్క్రుతాం నమస్కరోమి భాస్వరం ౩



అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం

పురారిపూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం

కపోలదాన వారణం భజే పురాణవారణం ౪



నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం

అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనం

హృదంతరేనిరంతరం వసంతమేవ యోగినాం

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ౫



మహాగణేశ పంచరత్న మాదరేన యో న్వహం

ప్రగాయతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం

ఆరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సో చిరాత్ ౬




Listen to the song

వేంకటేశ్వర వజ్ర కవచ స్త్రోత్తం

నారాయణ పరబ్రహ్మ సర్వ కారణ కారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షో పురుషః వేంకటేశ శిరోవతు
ప్రానేశ ప్రాననిలయః ప్రాణం రక్షతుమే హరిః


ఆకశారాట్ సుతనాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమః పాయా ద్దేహం మే వెంకటేశ్వరహ
సర్వత్ర సర్వకార్యేషు మంగాంబ జాని రీశ్వరహ
పాలయేన్నామకం కర్మ సాఫల్యం నహ ప్రయచ్చతు

య ఏతత్ వజ్రకవచ మభేధ్యం వెంకటేశ్వరహ
సాయం ప్రాత హ పటేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

భజన - వైష్ణవ జనతో

వైష్ణవ జనతో తేనే కహియేజే,
పీడ పరాయీ జానే రే
పర దుక్ఖే ఉపకార్ కారే తోయే,
మన అభిమాన న ఆనే రే .... వైష్ణవ జనతో...

సకల్ లోక మ సహునే వందే,
నిందా న కరే కేని రే
వాచ్ కాచ్ మాన్ నిశ్చల్ రాఖే,
ధన ధన జనని తేని రే .... వైష్ణవ జనతో.....

సమ ద్రిష్టి నే త్రిష్ణ త్యాగి,
పర స్త్రీ జేనే మాత రే
జిహ్వా థకే, అసత్య న బోలె,
పరధన్ నవ ఝాల హాత్ రే ....వైష్ణవ జనతో...

మొహ మాయ వ్యాపే నహి జేనే,
ద్రిడ్ వైరాగ్య జేనే మాన్ మ రే
రామ్ నాం సుతాలీ లాగే
సకల తిరాథ్ తేనే తన మ రే .. వైష్ణవ జనతో....

వన్ లోభి నే కపట రహిత్ జే,
కామ క్రోద్ నివార్యా రే
భనే నర సయ్యో తేను దర్శన కర్తా,
కుల ఎ కోటేరే తాయ రే .... వైష్ణవ జనతో ....

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger