Thursday 22 December 2011

రచననిన్నిట రసికుడవు

రచననిన్నిట రసికుడవు
ఇచట విన్నపంబిదె నేసెదను ||

పలుకుల చిలుకల పాట కోవిలల
పులుచులుగా చెలి పెంచెనదే
అలుగకుమీ నీవందుకు రమణుడ
కల సహజమె ఇది కసరులు గావు ||

చనుజక్కవలను సతి నెరులయలుల
ఘనముగ మూకలు గట్టించె
మొనలుచూపె మోపుగట్టెనని
ననిచి వేసరకు నాధుడవు ||

నడపుల హంసల నయనచాతకముల
పడతి శ్రీ వేనకటపతి పొదిగె
నిడువుల గూడుచు నిన్ను సోకించెనని
జడియకుమీ నీచనవులె మెరసి. ||



rachananinniTa rasikuDavu
ichaTa vinnapaMbide naesedanu ||

palukula chilukala paaTa kOvilala
puluchulugaa cheli peMchenadae
alugakumee neevaMduku ramaNuDa
kala sahajame idi kasarulu gaavu ||

chanujakkavalanu sati nerulayalula
ghanamuga mookalu gaTTiMche
monaluchoope mOpugaTTenani
nanichi vaesaraku naadhuDavu ||

naDapula haMsala nayanachaatakamula
paDati Sree vaenakaTapati podige
niDuvula gooDuchu ninnu sOkiMchenani
jaDiyakumee neechanavule merasi. ||

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger