Thursday 24 February 2011

హరినామము కడు ఆనందకరము

Get this widget | Track details | eSnips Social DNA


హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా

నళినాక్షుని శ్రీనామము
కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధమోచనము
తలచవొ తలచవొ తలచవొ మనసా

నగధరునామము నరకహరణము
జగదేకహితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవొ పొగడవొ పొగడవొ మనసా

కడిగి శ్రీవేంకటపతి నామము
బడి బడినే సంపత్కరము
అడియాలంబిల నతిసుఖమూలము
తడవవొ తడవవొ తడవవొ మనసా

Wednesday 23 February 2011

త్రికరణశుద్ధిగా చేసిన పనులకు



త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును
ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాసపడనేల

తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి
కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్
దినకర సోమ గ్రహణకాలముల తీర్ధాచరణలు చేసిన ఫలములు
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు తిరుగగ మరియేల !

హరియను రెండక్షరములు నిడువిన అఖిల వేదములు మంత్రములు
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు
పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకగనేల


మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తిమొక్కినమాత్రము లోపలనే
పదిలపు షోడసదానయాగములు పంచమహా యజ్ఞంబులుని
వదలక సాంగంబులుగా చేసినవాడేకాడా పలుమారు
మది మది నుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేల

Wednesday 9 February 2011

గోవింద గోవిందయని కొలువరే

Get this widget | Track details | eSnips Social DNA


గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు

గోవింద గోవిందా ......

పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు

గోవింద గోవిందా ......

దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు

గోవింద గోవిందా ......

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger