Wednesday 18 February 2015

ఇందుకు విరహితము


ఇందుకు విరహితము లిన్నియు నజ్ఞానమని
చందమున గీతలందు జాటీ నిదివో

మానావమానములు మానిడంబు విడుచుట
పూని హింసకు జొరక యరుపు గలుగుటయు
అని మతి గరగుట యాచార్యోపాసన
తానెప్పుడు శుచియౌట తప్పని విజ్ఞానము

అంచల సుస్థిర బుద్ధి యాత్మ వినిగ్రహము
అంచిత విషయ నిరహంకారాలు
ముంచిన జన్మ దుఃఖములు దలపోయుట
కంచపు సంసారము గడచుటే జ్ఞానము

అరి మిత్ర సమబుద్ధి అనన్య భక్తియు
సరి నేకాంతమును సజ్జన సంగవిముక్తి
ధర నధ్యాత్మ జ్ఞానతత్వము తెలియుట
గరిమ లందుట శ్రీవేంకటపతి జ్ఞానము


Meaning : -    భగవంతుడు గీతలో వివరించిన జ్ఞానా జ్ఞానములను ఈ కీర్తనలో తెల్పుతున్నాడు అన్నమయ్య.  మానము అవమానములను వర్జించడం, దంభం లేకుండుట, హింసాప్రవృత్తి లేకుండడం, ఓర్పు కలిగి ఉండడం, గురు సేవ, శౌచము అనేవి ; విషయ సుఖాలందు వైరాగ్యం అహంకారం లేకుండా వుండటం, అందరి యందు సమ సమ భావం కలిగి ఉండడం మొదలైనవి జ్ఞానము.  వీటికి భిన్నమైనది అజ్ఞానం.





induku virahitamu linniyu najnaanamani
chandamuna geetalandu jaaTee nidivoa

maanaavamaanamulu maaniDambu viDuchuTa
pooni himsaku joraka yarupu galuguTayu
ani mati garaguTa yaachaaryoapaasana
taaneppuDu SuchiyouTa tappani vijnaanamu

anchala susthira buddhi yaatma vinigrahamu
anchita vishaya nirahamkaaraalu
munchina janma du@hkhamulu dalapoayuTa
kanchapu samsaaramu gaDachuTea jnaanamu

ari mitra samabuddhi ananya bhaktiyu
sari neakaantamunu sajjana sangavimukti
dhara nadhyaatma jnaanatatvamu teliyuTa
garima landuTa SreeveankaTapati jnaanamu

Briefly : - bhagavantuDu geetaloa vivarinchina jnaanaa jnaanamulanu ee keertanaloa telputunnaaDu annamayya.  maanamu avamaanamulanu varjinchaDam, dambham leakunDuTa, himsaapravRtti leakunDaDam, oarpu kaligi unDaDam, guru seava, Souchamu aneavi ; vishaya sukhaalandu vairaagyam ahamkaaram leakunDaa vunDaTam, andari yandu sama sama bhaavam kaligi unDaDam modalainavi jnaanamu.  veeTiki bhinnamainadi ajnaanam.

1 comments:

Unknown said...


వెంకన్న సేవ కి Whatsapp

https://www.youtube.com/watch?v=X9cAkbSfr0k&feature=youtu.be

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger